హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ సీపీ గౌస్ ఆలం హోం గార్డు పోస్టింగ్‌ల్లో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. శనివారం అసెంబ్లీలో పోలీసు సంక్షేమంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 337 మంది హోంగార్డులను కరీంనగర్ నుంచి సిరిసిల్ల, జగిత్యాలకు బదిలీ చేశారని, ఇందు లో 186 మందికి పోస్టింగ్ ఇచ్చేందుకు రూ.1.86కోట్ల సీపీ వసూలు చేశారని ఆరోపించారు.
కరీంనగర్లో అలాట్ అయిన ఇన్నోవా వాహనాన్ని నిహైదరాబాద్లో తిప్పుతున్నారని మండిపడ్డారు. సీపీపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సీపీ గౌస్ ఆలంపై వెంటనే సిట్ వేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా పోలీసులకు రావాల్సిన పీఆర్సీ, ఏరియర్స్, టీఏలు, డీఏలను వెంటనే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.