Govt Schools | హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ఎన్రోల్మెంట్ తగ్గుతున్నది. ప్రైవేట్పై మోజుతో సర్కారు స్కూళ్లల్లో చేరేవారు కరువయ్యారు. అటు తల్లిదండ్రులు, ఇటు విద్యార్థుల్లో సర్కారు స్కూళ్లపై నమ్మకం సన్నగిల్లుతున్నది. మరీ ముఖ్యంగా ప్రైమరీ స్కూళ్లు దారుణ పరిస్థితుల్లో ఉన్నాయి. పలు ప్రాంతాల్లో విద్యార్థులు చేరకపోవడంతో స్కూళ్లు మూసివేత దిశలో సాగుతున్నాయి. తాజా వివరాల ప్రకారం రాష్ట్రంలో 1,980 జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లున్నాయి.
ఇందులో 1,900 స్కూళ్లు ప్రాథమిక పాఠశాలలే. మరో 40 చొప్పున ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. 2020లో జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్ల సంఖ్య 1,245 ఉండగా, 2022 వరకు ఈ స్కూళ్ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. 2023లో జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్ల సంఖ్య 1,307కు పెరగగా, 2025కు వచ్చే సరికి 2వేలకు చేరాయి. అంటే ఈ ఏడాదిన్నర కాలంలోనే వెయ్యి సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య జీరో అయ్యింది.
వివరాలిలా..