సూర్యాపేట: సూర్యాపేట (Suryapet) జిల్లా దవాఖానలో ఔట్సోర్సింగ్ సిబ్బంది విధులు బహిష్కరించారు. ఆరు నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదంటూ.. విధులు బహిష్కరించి హాస్పిటల్ ఆవరణలో ధర్నాకు దిగారు. దీంతో ఓపీ సేవలు నిలిచిపోయాయి.
హాస్పిటల్ అధికారులు, జిల్లా కలెక్టర్ తమ సమస్యను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. చిరుద్యోగులైన తమకు ఆరు నెలలుగా వేతనం ఇవ్వకుంటే బతికేదెలా అని ప్రశ్నించారు. సిబ్బంది ధర్నాతో పేద రోగులకు తిప్పలు తప్పడం లేదు. ఓపీ స్లిప్పులు ఇచ్చేవారు లేకపోవడంతో పెద్ద సంఖ్యలో రోగులు హాస్పిటల్ ఆవరణలో వేచిఉన్నారు.
Suryapet