‘ఇందిరమ్మ’లో అవకతవకలపై ఆగ్రహం
పేదల కోసం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని చెప్తున్నా.. అధికార పార్టీకి చెందిన వారికే ప్రాధాన్యమిస్తున్నారని అధికారులను లబ్ధిదారులు నిలదీశారు.
- కాంగ్రెస్ పార్టీకి చెందినవారికే కేటాయిస్తున్నారని నిరసన
- జనగామ జిల్లా ఇప్పగూడెం గ్రామంలో అధికారుల నిలదీత
స్టేషన్ ఘన్పూర్, జూన్ 6: పేదల కోసం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని చెప్తున్నా.. అధికార పార్టీకి చెందిన వారికే ప్రాధాన్యమిస్తున్నారని అధికారులను లబ్ధిదారులు నిలదీశారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు అక్రమాలకు పాల్పడుతున్నందున వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. శనివారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం ఇప్పగూడెంలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో మొదటి విడతలో 55 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారని, పదిమంది ఇండ్లు నిర్మించకపోవడంతో రద్దు చేశారని గ్రామస్తులు తెలిపారు.
ఇటీవల ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇప్పగూడేనికి మరో 50 ఇండ్లు మంజూ రు చేశారని పేర్కొన్నారు. ఇందులో 40 మంది ఇండ్లు నిర్మించుకోగా, పదిమందిని హోల్డ్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే 40మందిలో కూడా అత్యధికులు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారేనని అధికారులను నిలదీశారు. కొలిపాక వెంకటయ్య, కమ్మం చం ద్రమౌళి ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని, పాత ఇండ్లను కూలగొట్టారని, తీరా ఇం డ్లు కేటాయించకపోవడంతో అద్దె ఇం డ్లలో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశా రు. ఇప్పటికైనా ఇందిరమ్మ ఇండ్లపై విచారణ జరిపి, అర్హులకే కేటాయించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్లో అక్కినేని అభిమానులు
BRS Protest | రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి.. చెల్పూరులో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ధర్నా
Niti Taylor | సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన నీతి టేలర్!
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

