నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ఎల్లికట్ట గ్రామంలో మంగళవారం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సన్నాలకు ప్రభుత్వం రూ. 500 బోనస్ ఇస్తుందని చెప్పారు. అయితే ఈ విషయం రైతులకు తెలియడం కోసం సన్నాలు అమ్మిన నెలరోజులకు బోసన్ ధర రూ.500 ఇస్తామని తెలిపారు. ‘మా ప్రభుత్వ విలువను కాపాడుకునేందుకు బోనస్ ధర ప్రత్యేకంగా ఇస్తాం.. ఇది వాస్తవం.. అందరూ ఒప్పుకోవాలి.. బోనస్ ధర భరిస్తున్నప్పుడు మా గొప్పతనం తెలిపేందుకు నెల రోజుల తర్వాత బోనస్ డబ్బులు ఇస్తాం’ అని అన్నా రు. కార్యక్రమంలో అధికారులు, నాయకు లు, తదితరులు పాల్గొన్నారు.