హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంకు వ్యతిరేకంగా మహారాష్ట్రలోనూ ఓట్ ఫర్ పెన్షన్ మహోద్యమం ప్రారంభమైంది. మంగళవారం నాగ్‌పూర్‌లో సీపీఎస్ ఉద్యోగులంతా ఓపీఎస్ సంకల్ప యాత్ర నిర్వహించారు.
ఈ యాత్రలో నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (ఎన్‌ఎంవోపీఎస్) సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ మాట్లాడుతూ, కర్ణాటకలో ప్రారంభమైన ఓట్ ఫర్ పెన్షన్ మహోద్యమం మహారాష్ట్రకు పాకిందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో పాత పెన్షన్ ఇచ్చే పార్టీలకే ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు.