Radiology | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పోస్ట్ ఎమ్మెస్సీ డిప్లొమా ఇన్ రేడియోలాజికల్ ఫిజిక్స్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగారెడ్డి తెలిపారు.
నగరంలోని పలు ప్రముఖ ఆస్పత్రుల సహకారంతో ఫిజిక్స్ విభాగం అందిస్తున్న ఈ కోర్సులో చేరేందుకు ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్లలో కనీసం 60 శాతం మార్కులతో పీజీ పూర్తి చేసి ఉండాలని చెప్పారు. ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. దరఖాస్తులను ఈ నెల 11వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు స్వీకరించనున్నట్లు చెప్పారు. రూ.500 అపరాధ రుసుముతో 10వ తేదీ వరకు స్వీకరిస్తామన్నారు. ప్రవేశ పరీక్షను వచ్చే నెల 14వ తేదీన నిర్వహిస్తామన్నారు. ఇతర వివరాలకు www.ouadmissions.com, www.osmania.ac.in వెబ్సైట్లలో చూసుకోవచ్చని సూచించారు.
ఇవి కూడా చదవండి..
Dasoju Sravan | రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి అనర్హుడు : దాసోజు శ్రవణ్
Harish Rao | రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి.. కానీ చేతలు గడప దాటడం లేదు : హరీశ్ రావు
Health Tips | ఊబకాయంతో విసిగిపోతున్నారా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
MS Dhoni – Trump | అమెరికా అధ్యక్షుడితో గోల్ఫ్.. ధోనీ వీడియో వైరల్