హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : వర్షాకాలం వచ్చినా వనమహోత్సవంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంలేదని ప్రతిపక్షాల నేతలు, పర్యావరణవేత్తల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాదిలో 18 కోట్ల మొక్కలు నాటుతామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు.. షెడ్యూల్ మాత్రం ఖరారు చేయలేదని మండిపడుతున్నారు.
అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. వివిధశాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించారు. కానీ సీఎం కూడా సమీక్ష నిర్వహిస్తేనే కార్యక్రమం ఎప్పుడో క్లారిటీ వస్తుందని అటవీశాఖ అధికారులు చెప్తున్నారు.