Regional Parties | హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): జతకట్టని ప్రాంతీయ పార్టీలను కాంగ్రె స్, బీజేపీ కూడబలుక్కొని పథకం ప్రకారం అణచివేశాయన్న అభిప్రాయం బలపడుతున్నది. కలిసివస్తే చెయ్యి అందిస్తాం.. లేకపోతే ఖతం చేస్తాం అనే ధోరణితో రెండు జాతీయ పార్టీలు పోటీపడి ప్రాంతీయ పార్టీలపై విషప్రచారం చేశాయని, దురదృష్టవశాత్తు వాటి కు యుక్తులే విజయం సాధించాయన్న అభిప్రా యం వ్యక్తమవుతున్నది. ఎన్డీయే, ఇండియా కూటములు తమ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా పనిచేశాయి తప్ప వేరే లక్ష్యం లేదని రాజకీయ పండితులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ సహా అనేక రాష్ర్టాల్లో కూటమితో కలవకుండా ఒంటరిగా పోటీ చేసిన ప్రాంతీ య పార్టీలకు చేదు అనుభవం ఎదురైందన్న వాదన వినిపిస్తున్నది.
బీఆర్ఎస్ సైతం ఏదో ఒక కూటమిలో చేరితే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వేరేలా ఉండేవన్న అభిప్రాయాలు ఆ పార్టీలో వ్యక్తమవుతున్నాయి. పార్టీ ముఖ్యనేతలు, ఉద్యమకారులు, మేధావులు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో జరిపిన సమాలోచనల సందర్భంగా ఇదే విషయం వెల్లడైనట్టు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల అనంత రం భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ విస్తృతంగా సమాలోచనలు జరుపుతున్నారు. శుక్రవారం కేసీఆర్‌ను పలువురు నాయకులు కలి సి పలు అంశాలపై చర్చలు జరిపినట్టు తెలిసింది. ‘తెలంగాణకు బీఆర్ఎస్ రక్షణ కవ చం.. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల యోగక్షేమాలే పరమావధిగా పార్టీ పనిచేస్తుంది. ఎన్నికల్లో గెలుపు ఒక్కటే రాజకీయం కాదు’ అని కేసీఆర్ అన్నట్టు తెలిసింది. కేసీఆర్‌ను కలిసిన వారిలో మాజీమంత్రి సబిత, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, మహేశ్వర్‌రెడ్డి, నడిపల్లి దివాకర్‌రావు, చల్మెడ లక్ష్మీనర్సింహారావు, పార్టీ సీనియర్ నేతలు పటోళ్ల కార్తీక్‌రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు.