Lung Transplant | హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజావైద్య రంగంలో మరో అరుదైన రికార్డు నమోదయింది. ఆరోగ్యశ్రీ కింద మొదటిసారి పూర్తి ఉచితంగా ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ నిర్వహించి, నిమ్స్ దవాఖా న వైద్యులు ఓ రోగికి ప్రాణం పోశారు. వరంగల్‌కు చెందిన 16 ఏండ్ల విద్యార్థి రాయపురి పూజను నిమ్స్ వైద్యులు మంగళవారం బ్రె యిన్డెడ్గా నిర్ధారించారు. కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు, కార్నియాను దానం చేసేందుకు అంగీకరించారు. దీంతో నిమ్స్ వైద్యులు ఒకే రోజు ఆరోగ్యశ్రీ కింద ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఈ ఏడాది ఇప్పటివరకు నిమ్స్‌లో 27 అవవయ మార్పిడులు చేశారు.
హైమావతికి ‘ఊపిరి’
సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన సీహెచ్ హైమావతి (45) ఆరేండ్లుగా ఊపిరితిత్తుల స మస్యతో బాధపడుతున్నది. ఊపిరితిత్తుల సా మర్థ్యం తగ్గిపోతుండటంతో.. ఇంట్లోనే ఆక్సిజన్‌పై చికిత్స పొందుతున్నది. ఆక్సిజన్ లేకుండా కొన్ని నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితికి చేరుకొన్నది. ఆమెకు ఊపిరితిత్తుల మార్పిడి తప్ప వేరే మార్గం లేదని నిమ్స్ వైద్యులు తేల్చా రు. నిరుడు జూన్‌లో జీవన్‌దాన్ కింద రిజిస్ట్రేషన్ చేసుకొన్నారు. వరంగల్‌కు చెందిన విద్యా ర్థి పూజ సోమవారం బ్రెయిన్ డెడ్ కాగా, ఆమె రక్తవర్గం, ఊపిరితిత్తుల పరిమాణం హైమావతికి సరిపోతాయని వైద్యులు నిర్ధారించారు. దీంతో మంగళవారం అవయవమార్పిడి విభా గం వైద్యుల నేతృత్వంలో శస్త్ర చికిత్స చేశారు.
ఒక్క మార్పిడి.. ఆరు సర్జరీలతో సమానం
సీటీ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ అమరీశ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం సుమారు 12 గంటల పాటు శ్రమించి హైమావతికి ఊపిరితిత్తుల మార్పిడి చికిత్సను విజయవంతంగా పూ ర్తి చేసింది. ఇందులో నిమ్స్‌కు చెందిన సుమా రు 8 విభాగాలు భాగస్వాములు అయ్యాయ ని, దాదాపు 40 మంది సిబ్బంది శ్రమించారని డాక్టర్ అమరీశ్ తెలిపారు. ప్రస్తుతం హైమావతి ఆరోగ్యం స్థిరంగా ఉన్నదని చెప్పారు. ఆమె పూర్తిగా కోలుకొనేందుకు మరింత సమయం పడుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వానికి ధన్యవాదాలు
నిమ్స్‌లో తొలిసారిగా ఆరోగ్య శ్రీ కింద ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స నిర్వహించడం సంతోషంగా ఉన్నది. ఇందులో భాగస్వాములైన సిబ్బందికి ప్రత్యేకంగా అభినందనలు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు అందిస్తున్న ప్రోత్సాహం వల్లే నిమ్స్‌లో వరుసగా అరుదైన సర్జరీలు నిర్వహించగలుగుతున్నాం. ప్రైవేట్‌లో రూ.20 లక్షల వరకు ఖర్చయ్యే సర్జరీలను సైతం ఆరోగ్య శ్రీతో ఉచితంగా పొందగలమనే భరోసా పేదలకు లభించింది. ఈ నమ్మకాన్ని కల్పించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు.
-డాక్టర్ బీరప్ప, సూపరింటెండెంట్, నిమ్స్