DA Pending | డీఏలే కాదు.. ఎరియర్స్ కూడా పెండింగే!..కరువుభత్యం బకాయిలు విడుదల చేయని సర్కార్
రాష్ట్రంలో సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వీరికి కరువుభత్యం (డీఏ) మాత్రమే కాదు; డీఏ బకాయిలు కూడా అందడంలేదు. డీఏలు పెండింగ్‌లో పెట్టిన సర్కార్ డీఏ ఎరియర్స్‌ను కూడా పెండింగ్‌లో పెట్టింది.
- కరువుభత్యం బకాయిలు విడుదల చేయని సర్కార్
- 3 డీఏలిచ్చినా సీపీఎస్ ఉద్యోగుల ఖాతాల్లో జమకాలేదు
- గతంలో రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు ఒకేసారి చెల్లింపు
- ఇక నుంచి ఇవి కూడా ఇన్‌స్టాల్‌మెంట్‌లోనే
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వీరికి కరువుభత్యం (డీఏ) మాత్రమే కాదు; డీఏ బకాయిలు కూడా అందడంలేదు. డీఏలు పెండింగ్‌లో పెట్టిన సర్కార్ డీఏ ఎరియర్స్‌ను కూడా పెండింగ్‌లో పెట్టింది. ఆరు నెలలకు ఒకసారి ఇవ్వాల్సిన డీఏలను రెండేండ్లు ఆలస్యంగా మంజూరుచేస్తున్న ప్రభుత్వం.. ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో చెల్లిస్తామన్న బకాయిలను కూడా సీపీఎస్ ఉద్యోగుల ఖాతాల్లో జమచేయడంలేదు. రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా సీపీఎస్ ఉద్యోగులున్నారు. ఎరియర్స్‌ను జమ చేయకపోవడంతో వీరంతా రూ.వెయ్యికోట్ల వరకు నష్టపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మూడు డీఏలను విడుదల చేసింది. అయితే, ఇవి ఎప్పుడో ఇవ్వాల్సినవి.
ప్రతి డీఏనూ సర్కార్ రెండేండ్లు ఆలస్యంగా ఇస్తున్నది. అయితే, వీటిని బకాయి పడిన తేదీ నుంచి చెల్లించాల్సి ఉంటుంది. వీటినే డీఏ బకాయిలంటారు. ఈ మూడు డీఏ ఎరియర్స్ కోసం సీపీఎస్ ఉద్యోగులు ప్రతి నెలా మూడు బిల్లులు తయారుచేసి, సబ్‌ట్రెజరీ ఆఫీసుల్లో సమర్పిస్తున్నారు. కానీ, డీఏ ఇన్స్టాల్మెంట్ కూడా తమ ఖాతాల్లో జమ కాలేదు. దీంతో ఉద్యోగుల్లో అయోమయ పరిస్థితి నెలకొన్నది. ఇంతకుముందు రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలుంటే, అన్ని వాయిదాలు ఒకేసారి చెల్లించేవారు. కానీ, ఇప్పుడు ఆ వెసులుబాటును కూడా తొలగించారు. 2023 జనవరి నుంచి 2025 జూన్ వరకు ఇవ్వాల్సిన బకాయిలను 28 వాయిదాల్లో చెల్లించాలనే నిబంధన చేర్చి, సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేశారట. దీనిపై సీపీఎస్ రిటైర్డ్ ఉద్యోగులు మండిపడుతున్నారు.
ఇదీ పరిస్థితి
- జీవో-120, జీవో-79 ద్వారా సర్కార్ ఒక డీఏ విడుదల చేసింది. జూలై 2022 నుంచి అక్టోబర్ వరకు చెల్లించాల్సిన బకాయిలను 17 ఇన్స్టాల్మెంట్లల్లో చెల్లిస్తామని తెలిపింది. వీటిని 2025 జనవరి నుంచి 17 వాయిదాల్లో చెల్లించాలి. కానీ, ఇంతవరకు మూడు వాయిదాలు (జనవరి, ఫిబ్రవరి, మార్చి)మాత్రమే చెల్లించారు. 2025 ఏప్రిల్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు 11 మాసాలు గడిచాయి. ఈ 11 వాయిదాల్లో ఒక్కటి కూడా జమకాలేదు.
- జీవో-78 ద్వారా మరో డీఏ మంజూరుచేసింది. జూలై 2025 నుంచి 28 సమాన వాయిదాల్లో బకాయిలు చెల్లిస్తామని తెలిపింది. ఉద్యోగులు 7 బిల్లులు ట్రెజరీల్లో సమర్పించారు. 2025 ఏప్రిల్ నుంచి ఇంతవరకు ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా ఉద్యోగుల ఖాతాల్లో పడలేదు.
- జీవో-2 ద్వారా సర్కార్ మరో డీఏ విడుదల చేసింది. ఇది 2023 జూలైలో రావాల్సిన డీఏ కాగా, 2025 డిసెంబర్లో ఇచ్చారు. ఈ మధ్యకాలంలో బకాయిలను 30 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. కానీ ఒక్కటి కూడా జమకాలేదు.
నష్టాలివే.. - జీపీఎఫ్ (జనరల్ ప్రావిడెంట్ ఫండ్) ఉద్యోగులు తమ ఖాతాల్లో ఇన్స్టాల్మెంట్లు సకాలంలో జమకావడంతో 8% వడ్డీ పొందుతున్నారు. ఈ డబ్బులు అవసరాలకు విత్‌డ్రా చేసుకోవచ్చు. కానీ, సీపీఎస్ ఉద్యోగులకు సకాలంలో జమకాకపోవడంతో అసలు, వడ్డీ రెండూ కోల్పోతున్నారు.
- ఉద్యోగ విరమణ పొందిన వెంటనే సీపీఎస్ ఉద్యోగి పెన్షన్ పొందే పరిస్థితి లేదు. 10% ఉద్యోగి ప్రాన్ ఖాతాలో జమకాకపోవడంతో పెన్షన్ప్లాన్ కొనుక్కునే వీల్లేకుండాపోతున్నది.
- పెన్షన్ ప్లాన్ కొనుక్కున్నట్లయితే, డీఏ బకాయిలు జమకాకపోవడంతో ప్రాన్ ఖాతా రద్దయ్యే ప్రమాదం ఉన్నది.
- వీటన్నింటి ఫలితంగా రిటైర్డ్ ఉద్యోగులు మార్కెట్ ఆధారిత పెన్షన్ రూ.వెయ్యి, రెండు వేలు మాత్రమే పొందాల్సిన పరిస్థితిని సర్కార్ కల్పిస్తున్నది.
క్రమం తప్పకుండా చెల్లించాలి: టీఎస్ సీపీఎస్ యూనియన్
డీఏ ఎరియర్స్‌ను పెండింగ్‌లో పెట్టడం అత్యంత దారుణం టీఎస్ సీపీఎస్ యూనియన్ పేర్కొన్నది. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న ఎరియర్స్‌ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. ఇకనుంచి ప్రతినెలా క్రమం తప్పకుండా ఎరియర్స్‌ను ఖాతాల్లో జమ చేయాలని కోరింది. జనవరి 2024 నుంచి ఇప్పటివరకు ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

