Harish Rao | కుర్మజాతిని గౌరవించింది కేసీఆర్ ప్రభుత్వమే అని హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మునిసిపాలిటీ పరిధిలోని తెల్లాపూర్ గ్రామంలో గల బీరప్ప స్వామి దేవాలయంలో జరుగుతున్న జాతర మహోత్సవానికి హాజరై స్వామి వారిని హరీశ్‌రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. మల్లన్న దేవున్ని కుల దైవంగా భావించే కుర్మలకే కొమురవెల్లి మల్లన్న దేవాలయ చైర్మన్ పదవి కేటాయించామని గుర్తుచేశారు.
మల్లన్న సాగర్ ప్రాజెక్టుతో మల్లన్న దేవుని పేరును చరిత్ర పుటల్లో నిలిపామని హరీశ్‌రావు గుర్తుచేశారు. మల్లన్న సాగర్, కాళేశ్వరం నుంచి ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించి కరువులేకుండా తెలంగాణను సుభిక్షంగా పాలించిన ఘనత కేసీఆర్‌దే అని అన్నారు. మల్లన్నకు 10 ఏళ్లు పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.