Heavy Rains | హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాలు, వరదల కారణంగా బడుల్లో మళ్లీ ఆన్లైన్ క్లాసులు ప్రారంభమయ్యాయి. కొన్ని బడులు మంగళవారం నుంచే ప్రారంభించగా, మరికొన్ని బుధవారం నుంచి బోధించనున్నాయి. భారీవర్షాల నేపథ్యంలో గత గురువారం నుంచి శనివారం వరకు విద్యాసంస్థలకు సెలవులిచ్చిన విషయం తెలిసిందే. గురువారం వరకు భారీ వర్షాలుంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో హైదరాబాద్లోని పలు స్కూళ్లు బుధవారం నుంచి ఆన్లైన్ క్లాసులుంటాయని మెసేజ్లు పంపించాయి.