మిరుదొడ్డి, అక్టోబర్ 3 : ఆన్లైన్ బెట్టింగ్‌లో భారీగా డబ్బులు కోల్పోయిన యువ వ్యాపారి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం రుద్రారంలో గురువారం చోటుచేసుకున్నది. మిరుదొడ్డి ఎస్సై బీ పరశురాములు తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రారం గ్రామానికి చెందిన ఇదారి నవీన్ (27) వ్యవసాయ సంబంధిత రసాయన ఎరువులు గ్రామంలో రైతులకు విక్రయిస్తుంటాడు.
సులభంగా ఆదాయం సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో ఆన్లైన్ బెట్టింగ్‌లకు బానిసైన నవీన్ రూ.26 లక్షల వరకు అప్పు చేశాడు. వాటిని తీర్చే మార్గం లేక తీవ్ర మనస్తాపానికి గురై గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబసభ్యులు నవీన్‌ను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడికి భార్య, రెండేండ్ల కుమారుడు ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.