Onions Prices | హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : ఉల్లి ధరలు మళ్లీ పెరిగాయి. వారం రోజుల్లోనే కిలో రూ.10 పెరిగింది. త్వరలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉల్లి ధరల ప్రభావం పడకుండా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అందులో భాగంగా పెరుగుతున్న ఉల్లి ధరలను నియంత్రించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.
మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలే ఉల్లి ధరల పెరుగుదలకు కారణంగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. పొరుగు రాష్ర్టాల్లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో మార్కెట్లోకి ఉల్లి దిగుబడులు గణనీయంగా తగ్గాయి.
దీంతో హోల్సేల్ మారెట్లో కిలో ఉల్లి రూ.40 నుంచి రూ.45, బహిరంగ మారెట్లో కిలో రూ.70కి చేరింది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని హోల్సేల్ వ్యాపారులు భయపడుతున్నారు.