Telangana | వెల్లివిరిస్తున్న ఆధ్యాత్మిక శోభ.. 16 ఆలయాల్లో కొనసాగుతున్న పనులు
తెలంగాణ రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిస్తున్నది. మున్నెన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలయాలను అభివృద్ధి చేస్తున్నది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదగిరిగుట్ట ఆలయం పనులు పూర్తయి భక్తజన సందోహంతో అలరారుతున్నది.
- రూ.305 కోట్లతో ఆలయాల అభివృద్ధి
- మరో ఐదింటికి తాజాగా నిధులు మంజూరు
- ప్రతినెలా 4 వేల గుడులకు ‘ధూపదీప నైవేద్యం’ నిధులు
Telangana | హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిస్తున్నది. మున్నెన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలయాలను అభివృద్ధి చేస్తున్నది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదగిరిగుట్ట ఆలయం పనులు పూర్తయి భక్తజన సందోహంతో అలరారుతున్నది. ఇతర ప్రధాన ఆలయాల్లో ముమ్మరంగా పనులు కొనసాగుతున్నాయి. జిల్లాల వారీగా ఎంపికచేసిన ప్రముఖ ఆలయాల్లో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ (ఎస్డీఎఫ్) కింద ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నది. ఇందులో 16 ఆలయాలకు సుమారు రూ.170 కోట్ల ఎస్డీఎఫ్ నిధులతో 146 పనులు మంజూరయ్యాయి.
అందులో రూ.51.47 కోట్లతో 90 పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మరో రూ.15 కోట్లతో చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. కాళేశ్వరం, చింతమడక ఆలయాలకు స్థల సేకరణలో ఇబ్బందులు ఎదురవగా, బాసర జ్ఞాన సరస్వతి ఆలయ పనులకు మాస్టర్‌ప్లాన్ రూపకల్పన జరుగుతున్నది. ధర్మపురి ఆలయ పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్నది. ఇవి మినహా మిగతా ఆలయాల్లో పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇటీవలే ప్రభుత్వం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి రూ.100 కోట్లు సహా మొత్తం ఐదు ప్రధాన ఆలయాలకు రూ.136 కోట్లను మంజూరు చేసింది. పనుల కోసం అధికారులు ప్రణాళికలు తయారు చేస్తున్నారు.
నాడు నిరాదరణలో ప్రధాన ఆలయాలు
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక మునుపు తెలంగాణలో ప్రధాన ఆలయాలు సైతం నిరాదరణకు గురయ్యాయి. అనేక పురాతన, చారిత్రక ఆలయాలను ఉమ్మడి పాలకులు పట్టించుకున్న పాపానపోలేదు. ఏ ఒక్క ఆలయానికీ ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయలేదు. యాదగిరిగుట్ట, భద్రాచలం వంటి ప్రధాన ఆలయాలను పట్టించుకోలేదు. ప్రత్యేక రాష్ట్రంలో ప్రభుత్వం దశలవారీగా ఆలయాలను అభివృద్ధి చేస్తున్నది. ప్రత్యేక నిధులు కేటాయిస్తూ భక్తులకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్నది. ఇవిగాకుండా ధూపదీప నైవేద్య పథకం కింద ప్రతినెలా రూ.6000 చొప్పున 4,000 ఆలయాలకు ప్రభుత్వం నిధులు విడుదల
చేస్తున్నది.
ఎస్డీఎఫ్ నిధులతో చేపట్టిన పనుల వివరాలు
- ఆలయాలు-16
- మంజూరైన పనులు- 146
- అంచనా వ్యయం- 169.75
- పూర్తయిన పనులు 90 (రూ.51.47 కోట్లు)
- పురోగతిలో ఉన్న పనులు-13 (రూ.14.68కోట్లు)
- ప్రారంభం కావాల్సిన పనులు- 43 (రూ.103.60కోట్లు)
-

01

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

