నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్(Nagar Kurnool) జిల్లాలో ఓ ట్రాలీ ఆటో(Auto accident )కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే..నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి సమీపాన ఉన్న సరస్వతి ఆలయం పక్కనగల కేఎల్ఐ కాలువలో(KLI canal) ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మంతటి గ్రామానికి చెందిన ఫాతిమా బేగం అనే మహిళ మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి.
మంతటి గ్రామానికి చెందిన ట్రాలీ ఆటో అదే గ్రామానికి చెందిన కూలీలను తీసుకొని పొలానికి వెళుతుండగా ఆలయం సమీపంలో కేఎల్ఐ కాల్వ మలుపు వద్ద అదుపుతప్పి కాలువలో పడింది. దీంతో మహిళ మృతి చెందగా, పది మందికి గాయాలైనట్లు తెలుస్తున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Warangal | ఆగిన గుండె.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ : వీడియో
Madusudhana Chary | శాసనమండలి ప్రతిపక్ష నేతగా మధుసూదనాచారి బాధ్యతల స్వీకరణ
Manne Krishank | మెయిన్‌హార్ట్ లీగల్ నోటీసులకు భయపడం.. తేల్చిచెప్పిన మన్నె క్రిశాంక్