హైదరాబాద్ : ఓ వ్యక్తికి సీపీఆర్(CPR) చేసి కానిస్టేబుల్(Constable) ప్రాణాలు కాపాడాడు. వివరాల్లోకి వెళ్తే..వరంగల్(Warangal) రంగలీల మైదానంలోని రావణవధ కార్యక్రమంలో జరిగిన తోపులాటలో ఓ యువకుడు హార్ట్ ఎటాక్‌కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే గమనించిన ఓ కానిస్టేబుల్ సీపీఆర్ చేసి అతని ప్రాణాలు కాపాడాడు. సకాలంలో స్పందించి సీపీఆర్ చేసి ఓ నిండు ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్‌ను పలువురు అభినందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆగిన గుండె.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్
వరంగల్ రంగలీల మైదానంలోని రావణవధ కార్యక్రమంలో జరిగిన తోపులాటలో ఓ యువకుడు హార్ట్ ఎటాక్ కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
వెంటనే గమనించిన ఓ కానిస్టేబుల్ సీపీఆర్ చేసి అతని ప్రాణాలు కాపాడాడు. pic.twitter.com/8LR8thFM8L
— Telugu Scribe (@TeluguScribe) October 13, 2024