రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల(Rajanna Sirisilla( జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. కోతిని తప్పించే క్రమంలో ఆటో బోల్తాపడి(Auto overturned) ఒకరు మృతి చెందగా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదకర సంఘటన వేములవాడ అర్బన్ మండలం పోశెట్టిపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.