సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన ఆరుగురు వరద హీరోలను బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. మంగళవారం ఖమ్మం నగర పర్యటనకు వచ్చిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు.. జేసీబీ ఓనర్ వెంకటరమణ, జేసీబీ డ్రైవర్ ఎస్కే సుభాన్, మొర్రిమేకల ఉపేందర్, మొర్రిమేకల జవహర్లాల్, నాగేశ్వరరావు, జీ వెంకటేశ్వరరావులను శాలువాలతో సత్కరించి అభినందించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): 343 మంది మిడ్వైఫరీలకు వైద్యారోగ్య శాఖ పోస్టింగులు ఇస్తూ కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రసవాలు అధికంగా నమోదయ్యే ద వాఖానలు, వైద్యులు అందుబాటు లో లేని ప్రాంతాల్లో నర్సులు పురు డు పోసేలా గత ప్రభుత్వం ‘నర్స్ ప్రాక్టీషనర్స్ ఇన్ మిడ్వైఫరీ’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి, నర్సులకు శిక్షణ ఇచ్చింది. 354 మందికి శిక్షణ ఇవ్వ గా, ఇందులో ఏడుగురు ఇప్పటికే గురుకులాల్లో నియమితులు కాగా, ఒక ఎన్‌పీఎం మరణించారు. మరో ముగ్గురు ఎంఈలుగా శిక్షణ పొందుతున్నారు. మిగతా 343 మందిని జిల్లాలకు కేటాయించారు.