వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మేడెపల్లికి చెందిన ముత్తోజి రాజమ్మ(68)కు కొడుకులు ఫణీంద్రాచారి, శ్రీనివాసాచారి, కూతుళ్లు స్వరూప, పద్మారాణి ఉన్నారు. అందరికి పెండ్లిళ్లు చేసింది. తనకున్న రెండున్నర ఎకరాల భూమి లో కొడుకులకు చెరో ఎకరం ఇచ్చి అర ఎకరం తన జీవనోపాధి కోసం ఉంచుకొన్నది.
తల్లి పేర ఉన్న భూమి పెద్ద కొడుకు లాక్కొని ఆమెను ఇంటి నుంచి గెంటివేశాడు. పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరుగలేదు. కన్నబిడ్డలు కాదనడంతో రెండు రోజులుగా చెట్టు కింద ఉంటూ రోదిస్తున్నది.