సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Aug 02, 2020 , 19:45:10

జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ పెద్దలపై కేసు నమోదు

జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ పెద్దలపై కేసు నమోదు

హైదరాబాద్ : నిర్మాణ కార్యకలాపాల సమయంలో అనుమతి లేకుండా రాళ్లను పేలుస్తూ మానవ ప్రాణాలకు అపాయం కలిగించారనే ఆరోపణలతో జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ పెద్దలపై జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

కాలనీ నివాసి పీ రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదు నేపథ్యంలో ఈ కేసును నమోదైంది. గురువారం సొసైటీ అధ్యక్షుడు, కార్యదర్శి సొసైటీ కాలనీలో ప్లాట్లు కలిగి ఉన్న సీ సిరీష ఇంటి ప్రక్కనే ఉన్న ప్లాట్‌లో రాళ్లను పేల్చడానికి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను ఉపయోగించారని చెప్పారు. నిర్మాణ పనులను చేపడుతున్న కాంట్రాక్టర్ పేరును కూడా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

“పేలుడు పదార్థాల వాడకం వల్ల ఒక పెద్ద బండరాయి తమ ఇంటిపై పడి గోడలతోపాటు పిల్లర్ దెబ్బతిన్నది. అధికారుల నుంచి అవసరమైన అనుమతులు తీసుకోకుండా, నష్టాలను అరికట్టే జాగ్రత్తలు తీసుకోకుండానే పేలుడు పదార్థాలను ఉపయోగించారు” అని ఫిర్యాదు చేశారని జూబ్లీ హిల్స్ పీఎస్ ఎస్ఐ ఎస్ నవీన్ రెడ్డి చెప్పారు. రామకృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వారిపై సెక్షన్ 336, 287, 427 ఆర్ / డబ్ల్యూ 34 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


logo