హైదరాబాద్ : రాయదుర్గంలో(Rayadrgam) విషాదం చోటు చేసుకుంది. నీటి సంపులో( Water sump) పడి సాఫ్ట్వేర్ ఉద్యోగి(24) మృతి(Died ) చెందాడు. ఈ విషాదకర సంఘటన అంజయ్యనగర్‌లో ఓ హాస్టల్లో చోటు చేసుకుంది. హాస్టల్లోని సంపు పై కప్పు తెరిచి ఉండటంతో ప్రమాదవశాత్తు సాఫ్ట్వేర్ ఉద్యొగి(Software employee) అందులోపడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. హాస్టల్ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.