ఆసిఫాబాద్ టౌన్, ఏప్రిల్21 : హనుమాన్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ వీరాంజనేయ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్ర కనుల పండువగా సాగింది. ఆలయ ప్రధాన అర్చకుడు శిరీష్ శర్మ పూజలు నిర్వహించిన అనంతరం జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు అరిగెల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు శోభాయాత్రను ప్రారంభించారు.
ఎమ్మెల్యే కోవలక్ష్మి పాల్గొని మొక్కుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కార్యదర్శి గుండా వెంకన్న, కోశాధికారి పిన్న వివేక్, కమిటీ ప్రముఖులు రాధాకృష్ణాచారి, శ్రీనివాస్, మధు, డాక్టర్ రమేశ్, ప్రకాశ్‌గౌడ్, సుధాకర్ ఏర్పాట్లు చేయగా, ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్, మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గౌడ్, మారెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు వెంకన్న, నాయకులు విశాల్, కోట వెంకన్న పాల్గొన్నారు.