హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : విద్యార్థుల్లో ఊబకాయం పెరుగుతుండటం, చిన్నారుల్లోనూ షుగర్ కేసులు బయటపడుతుండటంతో ప్రత్యేకించి స్కూళ్లల్లో ‘షుగర్‌బోర్డు’లు ఏర్పాటు చేయాలని కేంద్రం తాజాగా ఆదేశాలు ఇచ్చింది. వీటి ద్వారా ఊబకాయంపై అవగాహన కల్పించాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్) సభ్య కార్యదర్శి సంజయ్‌శర్మ అధికారులను ఆదేశించారు.
సోమవారం జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్‌హెచ్చార్డీలో జరిగిన బాలల హక్కులపై అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఇప్పటి వరకు 26వేల బాలల హక్కుల ఉల్లంఘన కేసులు పరిష్కరించి, 2,800 మంది బాలలకు రక్షణ కల్పించడమే కాకుండా, 1,800 మంది బాలలను సొంత జిల్లాలకు చేర్చామని పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతాదయాకర్‌రెడ్డి, సభ్య కార్యదర్శి పంచాక్షరి పాల్గొన్నారు.