BRS NRI | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి నేతృత్వంలో లండన్‌లోని టవర్ బ్రిడ్జి వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులు పూర్తయినా, 2023 ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయకపోవడంతో, నిరసనగా ప్లకార్డులు పట్టుకొని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు గడిచినా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజల పట్ల చిత్తశుద్ధి లేకపోవడానికి నిదర్శనమని అన్నారు. గత 420 రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేయడమే కాకుండా, ప్రశ్నించే ప్రతి పక్షాల గొంతు నొక్కేందుకు అక్రమ అరెస్టులు, నిర్బంధాలు కొనసాగిస్తూ, రాష్ట్రాన్ని 20 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లిందని విమర్శించారు.
అదే పిలుపు మేరకు ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు రవి కుమార్ రేతినేని యూకే పార్లమెంట్ ముందు (వెస్ట్ మినిస్టర్) నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేకపోతే ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొవాల్సి ఉంటుందని నవీన్ రెడ్డి, రవి రేతినేని హెచ్చరించారు.
#420Revanth #CongressFailedTelangana #LondonTowerBridge #NRIBRSUK #NaveenReddy @KTRBRS @NaveenReddyBRS pic.twitter.com/xIO91A8xL6
— NRI BRS UK (@nribrs) January 30, 2025
#420Revanth #CongressFailedTelangana #UKParliament #BigBen #Westminster #London #NRIBRSUK #RaviRetineni @KTRBRS @RaviRetineniBRS pic.twitter.com/hjViPgtASG
— NRI BRS UK (@nribrs) January 30, 2025
ఇవి కూడా చదవండి..
BRS | వరంగల్‌లో బీఆర్ఎస్ రైతు అధ్యయన కమిటీ పర్యటనకు అనుమతి నిరాకరించిన ప్రభుత్వం
Harish Rao | విశ్రాంత ఉద్యోగుల ఆవేదన ఈ ప్రభుత్వానికి పట్టదా?: హరీశ్‌రావు