Urea | హైదరాబాద్, డిసెంబర్ 30(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయని, రైతులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
కేటాయింపులకు అదనంగా కేంద్రం నుంచి యూరి యా వస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం 2.15 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉన్న ట్టు స్పష్టంచేశారు. భయాందోళనతో అవసరానికి మించి యూరియా కొనుగోలు చేయకుండా, అవసరం మేరకే రైతులు వినియోగించుకోవాలని సూచించారు. యూరియా అక్రమ నిల్వలు, బ్లాక్ మారెటింగ్కు పాల్పడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.