Pocharam Srinivas Reddy | ఎవరు ఎటు వెళ్లిన బీఆర్ఎస్కి నష్టం లేదు : మాజీ స్పీకర్ పోచారం
Pocharam Srinivas Reddy | ఎవరు వెళ్లిన బీఆర్ఎస్ నష్టం లేదని.. పార్టీలో ప్రస్తుతం గట్టి కార్యకర్తలు మాత్రమే మిగిలారని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ మంజుశ్రీ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
Pocharam Srinivas Reddy | ఎవరు వెళ్లిన బీఆర్ఎస్ నష్టం లేదని.. పార్టీలో ప్రస్తుతం గట్టి కార్యకర్తలు మాత్రమే మిగిలారని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ మంజుశ్రీ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. జహీరాబాద్ పార్లమెంట్లో బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి ప్రజలు భ్రమతో ఓట్లు వేశారన్నారు. హామీల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులుపడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను, చేస్తున్న మోసాలను ప్రజల్లో ప్రచారం చేయాలన్నారు. బీజేపీ పదేళ్ల పాలనలో ప్రజల కోసం ఒక్క పని చేయలేదని.. దేశానికి బీజేపీ చేసింది శూన్యమన్నారు. కులాలు, మతాలను అడ్డం పెట్టుకొని బీజేపీ రాజకీయం చేస్తుందని ఆరోపించారు.
ఈడీ, సీబీఐ, ఐటీలను ఉపయోగించి ప్రతిపక్షాలను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఎంపీలు ఉండి జహీరాబాద్ ప్రాంతానికి చేసింది ఏమీ లేదన్నారు. ఎంపీగా ఉండి స్వార్థం కోసమే.. వ్యాపారాలు చేసుకోవడానికి తప్ప ప్రజల కోసం చేసిందేమీ లేదన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. కార్యకర్తలు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో వచ్చే ఎన్నికల్లో పోరాడి గెలిపించాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ వేదికగా జహీరాబాద్ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. జహీరాబాద్ ప్రాంత ప్రజాల గొంతుకనై పోరాడుతానన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

