Ration Cards | రేషన్ కార్డులకు ఇంకా ఎలాంటి లిస్ట్ తయారు కాలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఏ లిస్ట్ అయినా గ్రామాల్లోనే తయారవుతుందని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులో ఆదివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. జనవరి 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు.
రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. గ్రామసభల్లోనే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలందరి సమక్షంలోనే నిష్పక్షపాతంగా, పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారని చెప్పారు.
వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎలాంటి షరతులు లేకుండా ఎకరానికి రూ.12 వేలు ఇవ్వబోతున్నాం: భట్టి విక్రమార్క
భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఏడాదికి 12 వేలు ఇస్తాం
ఈ నెల 26 నుంచి మొదలుకానున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్… pic.twitter.com/MOEdBX79zM
— BIG TV Breaking News (@bigtvtelugu) January 19, 2025
వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎలాంటి షరతులు లేకుండా ఎకరానికి రూ.12 వేలు ఇవ్వబోతున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఏడాదికి రూ.12 వేలు ఇచ్చామని చెప్పారు. ఈ నెల 26 నుంచి మొదలుకానున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను గ్రామసభల్లో నిష్పక్షపాతంగా ఎంపిక చేస్తారని పునరుద్ఘాటించారు.