కడ్తాల్, మార్చి 3 : రంగారెడ్డి జిల్లా కడ్గాల్ మండలంలో గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు భూములిచ్చే ప్రసక్తే లేదని రైతులు స్పష్టం చేశారు. కడ్తాల్ మండలంలో గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి ఇది వరకే రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. ఈ మేరకు రోడ్డు నిర్మాణానికి భూసేకరణ కోసం సోమవారం ముద్విన్, మర్రిపల్లి, ఏక్వాయిపల్లి గ్రామాల్లో అధికారులు గ్రామసభలు నిర్వహించారు. భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం అందజేస్తుందని వెల్లడించగా, గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి భూ ములు ఇచ్చేది లేదని రైతులు తెగేసి చెప్పారు. ఏక్వాయిపల్లి గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి ఉంటుందని, తొలుత ఆ రహదారిని అభివృద్ధి చేయాలని సూచించారు.
గద్వాల అర్బన్, మార్చి 3 : జోగుళాంబ గద్వాల జిల్లాలో ఓ ఆలయ అధికారి అవినీతి వ్యవహరంపై ‘నమస్తే తెలంగాణ’లో వరుస కథనాలు వెలువడగా ఉన్నతాధికారులు స్పందించి సదరు అధికారి అక్రమాలపై విచారణ చేపట్టినట్టు తెలిసింది. విచారణలో సదరు అధికారికి సంబంధించి కీలక విషయాలపై నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు పంపేందుకు సిద్ధ్దం చేసినట్టు సమాచారం. దీంతో అధికార పార్టీకి చెందిన ఓ రా జకీయ నాయకుడి సహకారంతో పత్రికల్లో వచ్చిన వార్తలు ఆరోపణలు అన్న విధంగా విచారణ నివేదిక మార్పులు చేసేందుకు రూ.60లక్షలకు డీల్ కుదుర్చుకున్నట్టు తెలిసింది. విచారణ క్రమంలో విదేశాలకు చెందిన కొందరు భక్తులు సదరు అధికారిపై ఫిర్యాదులు చేసినట్టు కూడా తేలింది.