టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నిలదీత
హైదరాబాద్, మార్చి 29 : దేశంలో సేంద్రియ సాగుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు ఏమిటని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు నిలదీశారు. దేశంలో ఎన్ని రాష్ర్టాలకు సేంద్రియ సేద్యానికి కేంద్రం సహకరిస్తున్నదని మంగళవారం లోక్‌సభలో ప్రశ్నించారు. 2020-21 నుంచి పరంపరాగత్ కృషి వికాస్ యోజన (పీకేవీవై) పథకాన్ని 16 రాష్ర్టాల్లో అమలుచేస్తున్నట్టు కేంద్రం చెప్తున్నదని గుర్తుచేశారు. దీనిపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ థోమర్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రసాయనరహిత సాగుకు కేంద్రం కృషిచేస్తున్నట్టు తెలిపారు. హెక్టార్‌కు రూ.12,200 ఆర్థిక సాయం అందజేస్తున్నదని చెప్పారు.