శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 02:50:37

శ్రీవారి దర్శనాలకు ఆటంకం ఉండదు: వైవీ సుబ్బారెడ్డి

శ్రీవారి దర్శనాలకు ఆటంకం ఉండదు: వైవీ సుబ్బారెడ్డి

తిరుమల/హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి దర్శనాలకు ఆటంకం ఉండదని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తిరుపతిలో లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో స్థానిక బుకింగ్‌ను నిలిపివేశామని తెలిపారు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న భక్తులకు దర్శనం కల్పిస్తామని చెప్పారు. కంటైన్‌మెంట్‌ జోన్లలో ఉండేవారు తిరుమలకు రావొద్దని విజ్ఞప్తిచేశారు.

శ్రీశైలంలో దర్శనాలు నిలిపివేత 

శ్రీశైలంలో భక్తుల దర్శనాలను మరో వారంరోజులపాటు నిలిపివేయనున్నట్టు ఆలయ ఈవో కేఎస్‌ రామారావు మంగళవారం చెప్పారు. దేవస్థాన ఉద్యోగులు కరోనా బారిన పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఆలయంలో దేవతామూర్తులకు నిత్య కైంకర్యాలు అర్చకస్వాములతో యధావిధిగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. 


logo