ఆదిలాబాద్: రేవంత్ సర్కార్ పట్టింపులేని పరిస్థితితో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) అన్నారు. రైతుబంధు ఇవ్వకపోయినా రైతులు కష్టపడి పంటలు పండిస్తే గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని విమర్శించారు. నామమాత్రపు కొనుగోలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. పాలకులకు శ్రద్ధ లేకపోవడంతో ఆదిలాబాద్‌లో సాగు తగ్గుతున్నదని చెప్పారు. బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ సభ్యులతో కలిసి ఆదిలాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్‌లో శుద్ధమైన నీరు లేకుండే. గత బీఆర్ఎస్ పాలనలో జిల్లాలో సమస్యలు లేకుండా చేశాం. కేసీఆర్ సర్కార్ కృషితో ఉమ్మడి ఆదిలాబాద్‌లో వలసలు తగ్గాయి. సాగునీటి కష్టాలు తీర్చిన ఘనత కేసీఆర్‌దే.
కొరాటా చనాకా ప్రాజెక్టు ట్రయల్ రన్ జరిగినా సాగునీరు కూడా ఇవ్వడం లేదు. రేవంత్ సర్కార్ పట్టింపులేని పరిస్థితితో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతుబంధు ఇవ్వకపోయినా రైతులు కష్టపడి పంటలు పండిస్తే గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. పత్తి, సోయాకు గిట్టుబాటు ధర లేక రైతులు లబోదిబోమంటున్నారు. కనీస మద్దతు ధరకు కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. నామమాత్రపు కొనుగోలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. పాలకుల శ్రద్ధ లేకపోవడంతో ఆదిలాబాద్‌లో సాగు తగ్గుతున్నది.
చనాకా కొరాటా ప్రాజెక్టుపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు. ఆ పార్టీ నేతలు రేవంత్ రెడ్డికి ఉప సంఘంగా పనిచేస్తున్నారా. రేవంత్ వైఫల్యాలను బీజేపీ ఎందుకు ప్రశ్నించడం లేదు. ప్రజల కష్టాలపై ప్రశ్నించకపోతే ఆ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచి ఏం లాభం. కౌలు రైతుకు రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. వ్యవసాయ కూలీలకు ఇస్తామన్న రూ.12 వేలు ఏమయ్యాయి. ఆదిలాబాద్ జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ నిర్మాణం ఏమైంది.’ అని రేవంత్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Live: మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ సభ్యులు
https://t.co/OXaigFAxDp— BRS Party (@BRSparty) January 25, 2025