హైదారబాద్ : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను చూసైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకోవాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ నడిపిన విచారణను ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ జీవధార కాళేశ్వరం మీద నిందలు మోపి బీఆర్ఎస్ , కేసీఆర్ ప్రతిష్ట దెబ్బ తీసేందుకు కాంగ్రెస్, బీజేపీ వాడుకున్నాయని ఆరోపించారు.
ప్రాజెక్ట్‌ను రెండున్నరేళ్లు మరమ్మతులు చేపట్టకుండా అడ్డుకున్నారు. చివరకు గత్యంతరం లేక మరమ్మతులు చేపడుతున్నారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ మీద చేసిన ఆరోపణలకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణ ప్రజలకు, రైతాంగానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పుపై ఆయన హర్షణీయం వ్యక్తం చేశారు.