హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో మూడు రోజులు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లా కొండమల్లేపల్లిలో అత్యధికంగా 6.84 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
నల్లగొండ జిల్లా చందంపేటలో 5.91 సెం.మీ, నిడమనూరులో 4.45 సెం.మీ, గుండ్లపల్లిలో 4.98 సెం.మీ, పెద్దఅడిశర్లపల్లిలో 3.87 సెం.మీ, నాగర్కర్నూల్ జిల్లా పడ్రలో 4.19 సెం.మీ, ఉప్పునూతలలో 4.16 సెం.మీ, వంగూర్లో 3.88 సెం.మీ, రంగారెడ్డి జిల్లా మాడ్గులలో 4.05 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఈ నెల నుంచి డిసెంబర్ వరకు రాష్ట్రంలో సాధారణం కంటే అధిక వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని కేంద్రం అంచనా వేసింది.