హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 453 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడిన వారిలో 591 మంది బాధితులు కోలుకున్నారు. మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసులు 6,51,288కి పెరిగాయి. ఇవాళ్టివరకు 6,39,456 మంది బాధితులు కోలుకున్నారు. మరో 8,137 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 3,836కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 88,164 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.