Huzurabad | జమ్మికుంటలో రూ. 2 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Huzurabad | జమ్మికుంట మండల పరిధిలోని నాగంపేట, గండ్రపల్లి గ్రామాల్లో రూ. 2 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు జమ్మికుంట రూరల్ ఇంచార్జి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ శంకుస్థాపన చేశారు.

జమ్మికుంట : జమ్మికుంట మండల పరిధిలోని నాగంపేట, గండ్రపల్లి గ్రామాల్లో రూ. 2 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు జమ్మికుంట రూరల్ ఇంచార్జి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేశ్ మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి విషయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే గండ్రపల్లి, నాగంపేట గ్రామాలకు సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనాలు మంజూరు చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు బడుగు, బలహీన వర్గాలకు ఎంతో దోహదపడుతాయని చెప్పారు.

దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెడుతున్న దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలవబోతుందన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల కార్యకర్తలు భారీ సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికి ఎమ్మెల్యే ఆరూరి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
జమ్మికుంట మండలంలోని నాగంపేట, గండ్రపల్లి గ్రామాలకు చెందిన 40 మంది లబ్దిదారులకు కొత్తగా మంజూరు అయిన పెన్షన్లను, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డ మమత, జడ్పీటీసి శ్రీరాం శ్యామ్, ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షురాలు కడవేరు మమత, సర్పంచులు పద్మ, స్వాతి, ఎంపీటీసీలు కవిత, రాజయ్య, మాజీ జడ్పీటీసీ వీరేశం, గ్రామ పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sweet Corn | మీ డైట్లో స్వీట్ కార్న్ ఉందా.. అయితే మీ ఆరోగ్య సమస్యలకు మీరు చెక్ పెడుతున్నట్టే..!
Rinku Singh | సమాజ్‌వాది పార్టీ ఎంపీని పెళ్లి చేసుకోబోతున్న క్రికెటర్ రింకూ సింగ్.. ఆమె ఎవరంటే..!
Pregnancy | 30 ఏళ్ల వయస్సులో గర్భం దాల్చడం కష్టమవుతుందా.. అండాల సంఖ్య తగ్గుతుందా..?
Bulgaria Accident | పొగమంచు ఎఫెక్ట్.. ఒకదానినొకటి ఢీకొన్న 86 వాహనాలు.. 12 మంది మృతి
Health Tips | వ్యాయామం చేసేటప్పుడు ఏదిపడితే అది తింటే ప్రమాదం.. ఎందుకో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

