Huzurabad | మైనార్టీల మద్దతు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కే
Huzurabad | రాబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికలో మైనార్టీలందరూ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కే మద్దతుగా ఉంటారని ఇల్లంతకుంట మండల మైనార్టీ నాయకులు స్పష్టం చేశారు. మండల పరిధిలోని సిరిసేడు గ్రామంలో

హుజూరాబాద్ : రాబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికలో మైనార్టీలందరూ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కే మద్దతుగా ఉంటారని ఇల్లంతకుంట మండల మైనార్టీ నాయకులు స్పష్టం చేశారు. మండల పరిధిలోని సిరిసేడు గ్రామంలో కరీంనగర్ టీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు మొహమ్మద్ అజీమ్ ఉద్దీన్, నయీమ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో హుస్సేన్, అక్బర్, ముస్తాఫా పాల్గొని తమ సమస్యలపై చర్చించారు. అనంతరం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లోని మసీదులు, ఈద్గాల అభివృద్ధిపై తయారు చేసిన నివేదికను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మైనార్టీ నాయకులు అందించారు.

ఈ సందర్భంగా అజీమ్ ఉద్దీన్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీలకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఎక్కడా లేని విధంగా మైనార్టీ విద్యార్థులకు రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ఏర్పాటు చేశారన్నారు. ఇమామ్‌లకు, మౌజంలకు గౌరవ వేతనం అందిస్తున్నారని పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో జరగబోయే ఉప ఎన్నికలో కారు గుర్తుకు ఓటేసి.. గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని మైనార్టీ వర్గాలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వలి పాషా, లాల్ మొహమ్మద్, రహీం హుస్సేన్ రబ్బాని, హకీం రజాక్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీ కొట్టిన కారు..ఆరుగురికి గాయాలు
woman found dead | మహిళ సూసైడ్.. ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నతాధికారి అరెస్ట్
Parvinder Singh Jhota | పర్వీందర్ సింగ్ ఝోటా హత్య కేసు.. డీఎస్పీ సహా డ్రగ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్
Arrest | హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్
AP News | వైఎస్ జగన్ ఒక క్రిమినల్ లిటిగెంట్.. రాజకీయాల్లో ఇలాంటి వాళ్లు ప్రమాదకరం : చంద్రబాబు
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

