హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం వార్డులవారీగా విడుదల చేసిన ఓటరు జాబితాలో అనేక తప్పులు దొర్లాయని, వాటిని సవరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. శనివారం ఎమ్మెల్సీలు ఎల్ రమ ణ, దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ లీగల్‌సెల్ చైర్మన్ సోమా భరత్‌కుమార్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి హైదరాబాద్‌లోని స్టేట్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో జాయింట్ సెక్రటరీ వినోద్‌ను కలిశారు.
ఓటరు జాబితాలో అనేక తప్పులు జరిగాయని, ఖమ్మం జిల్లాలో తొలగించిన 37 మంది ఓటర్లను జాబితాలో చే ర్చాలని, అభ్యంతరాల స్వీకరణ, సవరణ గడువును పొడిగించాలని విజ్ఞప్తిచేశారు. అనంతరం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సీఈవో సుదర్శన్‌రెడ్డిని కలిశారు. అంతకుముందు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసు ఆవరణలో వినోద్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఒక వార్డులో తప్పుగా నమోదైన ఓటర్లను వేరే వార్డులో కలిపే అధికారం ఉన్నదని ఎస్ఈసీ చెప్పడం ఎంతవరకు భావ్యమని పేర్కొన్నారు. అవసరమైతే ఢిల్లీలోని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్‌ను కలుస్తామని వెల్లడించారు.