హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): మిజోరాం రాజధాని ఐజ్వాల్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన 51.38 కిలోమీటర్ల రైల్వే లైన్‌ను శనివారం ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి 2014లో శంకుస్థాపన చేశారు. దాదాపు పదకొండేళ్ల పాటు కొనసాగిన ఈ ప్రాజెక్టు కోసం కేంద్రప్రభుత్వం రూ.8000 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. ఐజ్వాల్‌కు సమీపంలో బైరాబీ నుంచి సైరంగ్ వరకు నిర్మించిన ఈ 51.38 కిలోమీటర్ల రైల్వే లైన్ కోసం 45 కొండలను తొలిచి టన్నెళ్లు నిర్మించారు. ఈ రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా నిర్మించిన ఒక వంతెన అత్యంత లోతు నుంచి పిల్లర్లు నిర్మించారు. ఇది కుతుబ్‌మినార్ కంటే ఎైత్తెనదిగా దక్షిణ మధ్య రైల్వే జోన్ సీపీఆర్వో ఏ శ్రీధర్ స్పష్టం చేశారు. అండర్ పాసులు, వంతెనలు కలిపి 153 నిర్మించినట్టు తెలిపారు. వాటిలో 55 మేజర్ బ్రిడ్జిలు ఉన్నాయి. 97వ నంబర్ బ్రిడ్జిని 742 మీటర్లు పొడవుతో నిర్మించారు. 144వ బ్రిడ్జికి 114 మీటర్ల ఎత్తున పిల్లర్లు నిర్మించారు. బ్రిడ్జిల నిర్మాణం 11.78 కిలోమీటర్ల మేర జరిగింది.