హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మూడు కమిషనర్లు, 10 మంది నాన్‌క్యాడర్ ఎస్పీలను, నలుగురు జిల్లా కలెక్టర్లను కేంద్రం ఎన్నికల సంఘం బదిలీ చేసిన విషయం తెలిసిందే.
వీరి స్థానంలో ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున అధికారుల పేర్లను ప్రతిపాదించాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒక్కో పోస్టుకు ముగ్గురు అధికారుల చొప్పున కేంద్ర ఎన్నికల సంఘానికి గురువారం ప్రతిపాదనలు పంపింది.