హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): యాదాద్రి జిల్లాలోని మోత్కూరు, సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, భద్రాద్రి జిల్లాలోని దమ్మపేట మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు 128 మార్కెట్ కమిటీలకు పాలకవర్గాల నియామకం పూర్తయ్యింది.
విద్వేషాలు ప్రమాదకరం
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తేతెలంగాణ): మత విద్వేషాల వల్ల హైదరాబాద్ నగర భవిష్యత్ ప్రమాదకరంగా మారుతున్నదని పలువురు వక్తలు తెలిపారు. ‘మతోన్మాద శక్తుల నుం చి హైదరాబాద్‌ను కాపాడుకుందాం’ అనే అం శంపై సోమవారం సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాస్ అధ్యక్షతన సదస్సు జరిగింది.
పలువురు వక్తలు మాట్లాడుతూ నిరుద్యోగం, ధరల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కొన్ని పార్టీలు మత రాజకీయాలు చేస్తున్నాయని చెప్పారు.