గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Oct 12, 2020 , 12:52:14

య‌జ‌మానుల‌తో న‌మ్మ‌కంగా ఉంటూ దోపిడి: సీపీ స‌జ్జ‌నార్‌

య‌జ‌మానుల‌తో న‌మ్మ‌కంగా ఉంటూ దోపిడి: సీపీ స‌జ్జ‌నార్‌

హైద‌రాబాద్‌: ప‌ని మ‌నుషులుగా పెట్టుకునే ముందు వారి గురించి తెలుసుకోవాల‌ని సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ సూచించారు. రాయ‌దుర్గం చోరీ కేసులో నిందితుల‌ను వారం రోజుల్లోనే అరెస్టు చేశామ‌ని తెలిపారు. బోర్‌వెల్ వ్యాపారి ఇంట్లో చోరీకి పాల్ప‌డిన నేపాల్ ముఠాలోని ముగ్గురు స‌భ్యుల‌ను ఆదీనంలోకి తీసుకున్నామ‌ని చెప్పారు. మ‌రో ఐదుగురు నిందితులు ప‌రారీలో ఉన్నార‌ని తెలిపారు. నిందితుల నుంచి రూ.5.20 ల‌క్ష‌లు, బంగారం స్వాధీనం చేసుకున్నామ‌న్నారు. 

బోర్‌వెల్ వ్యాపారి మ‌ధుసూద‌న్‌రెడ్డి ఇంట్లో నేపాల్ ముఠా ప‌నిమ‌నుషులుగా చేరార‌ని సీపీ చెప్పారు. య‌జ‌మానుల‌తో న‌మ్మ‌కంగా ఉంటూ చోరీలు చేస్తున్నార‌న్నారు. ఆహార ప‌దార్థాల్లో మ‌త్తుమందు క‌లిపి చోరీల‌కు పాల్ప‌డుతున్నార‌ని తెలిపారు. ముఠాలో ప్ర‌ధాన నిందితుడు నేపాల్‌కు చెందిన నేత్ర‌గా గుర్తించామ‌న్నారు. నిందితుల కోసం ప‌ది ప్ర‌త్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలించామ‌ని, వారిని ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో అదుపులోకి తీసుకున్నామ‌ని తెలిపారు. నిందితుల‌ను ప‌ట్టుకునేందుకు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పోలీసులు బాగా స‌హ‌క‌రించార‌ని చెప్పారు. నేపాల్‌కు చెందిన ముఠా దేశంలోని ప‌లు ప్రాంతాల్లో చోరీల‌కు పాల్ప‌డింద‌ని వెల్ల‌డించారు.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo