హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో (Jubilee Hill By-Election) కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన చిన్న శ్రీశైలంయాదవ్ కుమారుడు నవీన్‌యాదవ్ (Naveen Yadav) ధమ్కీల మీద ధమ్మీలు ఇస్తున్నా రు. ఇటీవల బీఆర్ఎస్ క్యాడర్‌ను ఉద్దేశించి ‘గల్లీ దాటరు.. ఇంటిని చూడరు’ అంటూ బెదిరించిన ఆయన తాజాగా గులాబీ క్యాడర్‌నే లేకుండా చేస్తానని బెదిరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులు ఇటీవల చిన్న శ్రీశైలంయాదవ్‌ను బైండోవర్ చేశారు. దీనిని జీర్ణించుకోలేకపోతున్న నవీన్‌యాదవ్ కొన్ని రోజులుగా బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నారు. తనపై ఎలాంటి కేసులు లేవని ఆయన అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నా ఆయనపై 7 కేసులు ఉన్నాయనే విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. నామినేషన్ దాఖలు సమయంలో ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రౌడీషీటర్లను జూబ్లీహిల్స్‌కు తరలించడం కూడా నియోజకవర్గ ప్రజల్ని భయాందోళనకు గురిచేసింది. ఇక, శ్రీశైలంయాదవ్ వెంట మంత్రి సీతక్క, ఇతర నేతలు మార్కిం గ్ వాక్ చేయడంతో ‘రౌడీ షీటర్‌తో మంత్రి తిరగడమా?’ అని జనం ము క్కున వేలేసుకున్నారు. దీంతో ఇతర ప్రభుత్వ పెద్దలు కూడా ఆయనతో ప్ర చారం చేయించేందుకు జంకుతున్నారు. ఈ పరిణామాలన్నీ నవీన్యాదవ్ను మరింత అసహనానికి గురి చేస్తున్నాయి.
దీనికితోడు నవీన్‌యాదవ్ అనుచరులు నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తుండటంపై పార్టీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. వారంతా ప్రచారానికి దూరంగా ఉం టుండటంతో నవీన్ వర్గానికి ఏమి చేయాల్నో దిక్కుతోచడం లేదు. ఇంకోవైపు బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతుండటం పుండుమీద కారం చల్లినైట్టెంది. అందుకే 2రోజుల క్రితం మీడియా ముందు ‘గల్లీ దాటరు… ఇంటిని చూడరు’ అం టూ బీఆర్ఎస్ శ్రేణులను హెచ్చరించారు. ఇలా మాట్లాడే నవీన్‌యాదవ్ పొరపాటున గెలిస్తే సా మాన్యుడి పరిస్థితేమిటని జనం వాపోతున్నరు.
తాజాగా ఓ యూట్యూబర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సదరు యాంకర్ ‘బీఆర్ఎస్ క్యాడర్‌ను లేకుండా చేస్తా అంటున్నారు.. నిజంగా లేకుండా చేస్తారా?’ అని ప్రశ్నించగా ‘ఏసేస్తా’… వారం రోజుల్లో బీఆర్ఎస్ క్యాడర్ లేకుండా చేస్తా’ అంటూ మరోసారి ధమ్కీ ఇచ్చారు. దీనిపైనా సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో స్పందించారు. రౌడీబిడ్డకు టికెట్ ఇస్తే ఇలాంటి బెదిరింపులకే పాల్పడతారు, జూబ్లీహిల్స్ ఓటర్లూ బహుపరాక్ అని పలువురు సూచించారు. అయితే నవీన్‌యాదవ్ ఎన్ని ధమ్కీలు ఇచ్చినా బీఆర్ఎస్ క్యాడర్‌ను ముట్టుకోవడం కూడా సాధ్యం కాదని బీఆర్ఎస్ నేతలు బదులిస్తున్నారు.