హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్టు సీఈవో సుదర్శన్‌రెడ్డి మంగళవారం తెలిపారు. ఉత్సవాలకు హాజరు కావాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఆహ్వానం పలికారు.
హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణిలో 5736 దరఖాస్తులు అందినట్టు అధికారులు తెలిపారు. పంచాయతీరాజ్‌కు 132, విద్యుత్‌కు 131, రెవెన్యూ సమస్యలకు 43, ప్రవాసీ ప్రజావాణికి 1, ఇందిరమ్మ ఇండ్ల కోసం 5332 దరఖాస్తులు, ఇతర శాఖలకు సంబంధించి 97 అందాయని వెల్లడించారు.