Ambedkar Statue | స్పెషల్ టాస్క్ బ్యూరో, హైదరాబాద్/ హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే మరెక్కడా లేనివిధంగా హైదరాబాద్ నడిబొడ్డున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం ఆవిష్కరించారు. అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ గౌరవ అతిథిగా హాజరైన ఈ కార్యక్రమం ఆద్యంతం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకను తెలుగు మీడియాతోపాటు జాతీయస్థాయిలో ప్రధాన ఇంగ్లిష్, హిందీ పత్రికలు, న్యూస్ వెబ్సైట్లు, టీవీ చానళ్లు ప్రసారం చేశాయి. సోషల్ మీడియాలో అంబేద్కర్, భీమ్, బాబాసాహెబ్ తదితర హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌గా నిలిచాయి.
ఏఎన్ఐ: సీఎం కేసీఆర్ అన్వీల్స్ 125 ఫీట్ స్టాచ్యూ ఆఫ్ అంబేద్కర్
ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్: తెలంగాణ సీఎం కేసీఆర్ అన్వీల్స్ ఇండియాస్ టాలెస్ట్ 125 ఫీట్ స్టాచ్యూ ఆఫ్ అంబేద్కర్ ఇన్ హైదరాబాద్
ఇండియా టుడే: తెలంగాణ సీఎం కేసీఆర్ అన్వీల్స్ ఇండియాస్ టాలెస్ట్ 125 ఫీట్ స్టాచ్యూ ఆఫ్ అంబేద్కర్ ఇన్ హైదరాబాద్
ఇండియా టీవీ: తెలంగాణ సీఎం కేసీఆర్ అన్వీల్స్ ఇండియాస్ టాలెస్ట్ 125 ఫీట్ స్టాచ్యూ ఆఫ్ అంబేద్కర్ ఇన్ హైదరాబాద్
ఎన్డీటీవీ: 125 ఫీట్ టాల్ అంబేద్కర్ స్టాచ్యూ అన్వీల్డ్ బై కేసీఆర్ ఇన్ హైదరాబాద్
న్యూస్18: తెలంగాణ సీఎం కేసీఆర్ అన్వీల్స్ 125 ఫీట్ అంబేద్కర్ స్టాచ్యూ
ది ఎకనమిక్ టైమ్స్: తెలంగాణ సీఎం కేసీఆర్ అన్వీల్స్ 125 ఫీట్ స్టాచ్యూ ఆఫ్ అంబేద్కర్ ఇన్ హైదరాబాద్
ది ఫ్రీ ప్రెస్ జర్నల్: మాన్యుమెంటల్ ట్రిబ్యూట్.. తెలంగాణ సీఎం కేసీఆర్ అన్వీల్స్ ఇండియాస్ టాలెస్ట్ 125 ఫీట్ స్టాచ్యూ ఆఫ్ అంబేద్కర్ ఇన్ హైదరాబాద్
ఏబీపీ లైవ్: ఇండియాస్ టాలెస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ అన్వీల్స్ 125 ఫీట్ స్టాచ్యూ ఇన్ హైదరాబాద్
ఇండియా బ్లూమ్స్: కేసీఆర్ అన్వీల్స్ ఇండియాస్ టాలెస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ ఇన్ హైదరాబాద్
ది సియాసత్: కేసీఆర్ అన్వీల్స్ 125 ఫీట్ టాల్ అంబేద్కర్ స్టాచ్యూ
ది హిందూ: కేసీఆర్ అస్సర్ట్స్ బీఆర్ఎస్ వుడ్ ఫామ్ నెక్స్ గవర్నమెంట్ ఇన్ సెంటర్
ది వీక్: కేసీఆర్ అన్వీల్స్ బీఆర్ అంబేద్కర్ 125 ఫీట్ టాల్ స్టాచ్యూ ఇన్ హైదరాబాద్
టైమ్స్ నౌ: తెలంగాణ సీఎం కేసీఆర్ అన్వీల్స్ మ్యాసివ్ అంబేద్కర్ స్టాచ్యూ ఇన్ హైదరాబాద్
న్యూస్18 (హిందీ): భారత్ కో ఆజ్ మిల్ జాయేగా అంబేద్కర్ కీ సబ్సే ఊంచే మూర్తీ కా తోహ్ఫా, తెలంగాణ కే సీఎం కరేంగా అనావరణ్
ఏబీపీ న్యూస్ (హిందీ): హైదరాబాద్ మే కేసీఆర్ నే అంబేద్కర్ కీ 125 ఫీట్ కీ ప్రతిమా కా అనావరణ్ కియా, ప్రకాశ్ అంబేద్కర్ భీ రహే మౌజూద్
అమర్ ఉజాలా (హిందీ): 125 ఫీట్ ఊంచీ బాబా సాహెబ్ కీ మూర్తీ కా సీఎం కేసీఆర్ నే కియా అనావరణ్, అంబేద్కర్ కే పోతే బీ థే మౌజూద్
మిర్రర్ నౌ (టీవీ): కేసీఆర్ అన్వీల్స్ అంబేద్కర్ స్టాచ్యూ ఇన్ హైదరాబాద్
ఇండియా టుడే (టీవీ): తెలంగాణ సీఎం కేసీఆర్ అన్వీల్స్ ఇండియాస్ టాలెస్ట్ 125 ఫీట్ టాల్ స్టాచ్యూ ఆఫ్ అంబేద్కర్ ఇన్ హైదరాబాద్
ఏఎన్ఐ (టీవీ): సీఎం కేసీఆర్ అన్వీల్స్ 125 ఫీట్ స్టాచ్యూ ఆఫ్ అంబేద్కర్
అంబేద్కర్ విగ్రహావిష్కరణ సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.‘హైదరాబాద్ నడిగడ్డ మీద వెలిసిన అంబేద్కరుడా’ అంటూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. అంబేద్కర్ విగ్రహాన్ని వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాల్లో డీపీలుగా పెట్టుకొని మురిసిపోయారు. విగ్రహ నిర్మాణం నుంచి ప్రారంభోత్సవం వరకు ఆ పరిసరాల్లో దిగిన ఫొటోలను నెటిజన్లు పంచుకొన్నారు. ‘నేడు అంబేద్కర్‌కు నిజమైన గౌరవం దక్కింది’ అంటూ సంతోషం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ వల్లే ఇది సాధ్యమైందని ప్రశంసించారు.