Narendra Modi | నరేంద్ర మోదీ తెలంగాణకు ఒక్క పని చేసింది లేదు: ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Narendra Modi | ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) తెలంగాణకు ఒక్క మంచి పని చేసింది లేదని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరెడ్డి ఆరోపించారు.
మహబూబ్‌నగర్ : ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) తెలంగాణకు ఒక్క మంచి పని చేసింది లేదని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరెడ్డి ఆరోపించారు. నేను బాగుండాలి. నా దోస్త్ ఆదానీ(Adani), అంబానీ(Ambani) బాగుండాలనేది తప్పా మోదీ ప్రజలకు చేసిందేమి లేదని విరుచుకు పడ్డారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో బీఆర్ఎస్(BRS) ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
దేశ వ్యాప్తంగా ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తామని, నల్లధనం (Block Money))వెనక్కి తీసుకువస్తామని ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చలేకపోయారని ప్రశ్నించారు. తెలంగాణ మాదిరిగా రైతుబంధు(Raitu Bandu) , రైతుబీమా, కల్యాణ లక్ష్మి(Kalyana Laxmi) , వంటి పథకాలు అమలు చేస్తారా లేక రాయచూర్ ను తెలంగాణలో కలపాలా అని బీజేపీ నాయకులే అక్కడి ముఖ్యమంత్రిని ప్రశ్నించారని తెలిపారు.
తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులకు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కనబడడం లేదని ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నియోజకవర్గ పరిధిలో 68 గ్రామాలకు మాత్రమే బీటీ రోడ్డు ఉండగా , కేవలం గడిచిన తొమ్మిది ఏండ్లలో 58 గ్రామాలకు బీటీ రోడ్డు వేయించానని అన్నారు. నియోజకవర్గంలో సాగు విస్తీర్ణం పెరిగిందని, పింఛన్లను రెట్టింపు సంఖ్యలో ఇస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

