హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్-2025 ఫలితాల్లో ఆలిండియా అన్ని క్యాటగిరీల్లో నారాయణ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. తెలుగు రాష్ర్టాల్లో ఓపెన్ క్యాటగిరీలో ఫస్ట్ ర్యాంకు సాధించడంపై నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు పీ సింధూరనారాయణ, పీ శరణినారాయణ హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆలిండియా ఓపెన్ క్యాటగిరీలో మృణాల్ కిషోర్ ఝా 4వ ర్యాంకు, కేశవ్ మిట్టల్ 7వ ర్యాంకు, సౌమ్య శర్మ 14వ ర్యాంకు, కే జీవన్‌సాయి కుమార్ 18వ ర్యాంకు, రూపయన్ పాల్ 20వ ర్యాంకులతో సంచలన విజయాలు అందుకున్నట్టు తెలిపారు.
వీటితోపాటు 35,47,49, 59, 66, 70, 71,73,75,77,80,87,93,94,95 వంటి 100లోపు 22 ర్యాంకులు, 1000 లోపు 85 ర్యాంకులు నారాయణ విద్యార్థులు కైవసం చేసుకున్నట్టు పేర్కొన్నారు. అలాగే ఆలిండియా అన్ని క్యాటగిరీల్లో 1,2,3,3,4,4,7,10 వంటి 10 లోపు 8 ర్యాంకులు, 100 లోపు 65 ర్యాంకులు, 1000 లోపు 216 ర్యాంకులు సాధించి సరికొత్త రికార్డు సృష్టించినట్టు తెలిపారు. విశిష్టమైన ప్రణాళికలతో రూపొందించిన స్టార్ సీవో బ్యాచ్, ఎన్ -40 ప్రోగ్రామ్‌ల ద్వారా మాత్రమే టాప్ ర్యాంకుల సాధన నిరంతరాయంగా కొనసాగుతున్నదని వెల్లడించారు.