పాకిస్థాన్ ఉగ్ర మూకలపై భారత సైన్యం వీరోచిత దాడికి సంబంధించిన వార్తలను online edition (ntnews.com)లో కవర్ చేసే సమయంలో, బుధవారం జరగ కూడని పొరపాటు ఒకటి జరిగింది. దాన్ని గుర్తించిన వెంటనే, ఆన్లైన్ ఎడిషన్లో నుంచి, అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ నుంచి ఆ వార్తను తీసేయడం జరిగింది. న్యూస్ రూమ్లో జరిగిన ఈ పొరపాటుకి తీవ్రంగా చింతిస్తున్నాం. బేషరతుగా క్షమాపణ చెపుతున్నాం. ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగకుండా కఠినమైన దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నాం. భారతదేశ ప్రయోజనాలు, దేశ రక్షణ విషయంలో నమస్తే తెలంగాణ సంపూర్ణ నిబద్ధతతో, అంకిత భావంతో పని చేస్తుందని మాట ఇస్తున్నం. – ఎడిటోరియల్ బోర్డు