రామగిరి, డిసెంబర్ 22: నల్లగొండ జిల్లా నల్లగొండ మండలం మేళ్లదుప్పలపల్లికి చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి- జ్యోతి దంపతుల కుమారుడు పవన్‌రెడ్డి (25) అమెరికాలోని ఇస్క్రాన్ స్టేట్‌లో అకాల మరణం చెందాడు. ఉన్నత విద్య అభ్యసించడానికి అమెరికా వెళ్లిన పవన్‌రెడ్డి ఇటీవలనే ఎమ్మెస్సీ పూర్తి చేశాడు. మృతికి గల కారణాలు తెలియరాలేదని బంధువులు పేర్కొన్నారు. తమ కుమారుడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని, స్థానిక నాయకులను తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. కాగా వీరి కుమార్తె హైదరాబాద్‌లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నది.